Nimmala Rama Naidu: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్ కు నేటికి రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగింది అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రియంబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్ట్ ను విధ్వంసం చేసింది అని ఆరోపించారు. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు, పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ, CWC, PPA లను ఎప్పటికప్పుడు సమన్వయ పర్చుకుంటుందని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
Read Also: Yogi Adityanath: నేపాల్‌లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి ఆతిథ్యనాథ్.. మరో వివాదం..
ఇక, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా, డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తూ.. 136 మీటర్ల పొడవున, 6700 చదరపు మీటర్లు నేటికి పూర్తి చేయడం జరిగింది అని చెప్పారు. ఏప్రిల్ మొదటివారం నుంచి డి వాల్ నిర్మాణానికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి రానుందన్నారు. 7 ఏళ్ల తరువాత నిర్వాసితుల బాధలను ఉపశమించడానికి.. కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది అని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.