NTV Telugu Site icon

Margani Bharat Ram: పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా..!

Barath

Barath

Margani Bharat Ram: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం అని ఆయన మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టును అసలు కేంద్రానికే వదిలి పెట్టి ఉంటే బాగుండేది అని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నివేదిక ప్రజలను మోసం చేయడానికే.. అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం నిర్మాణం జగన్ ప్రభుత్వంలోనే కట్టారు అని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు.

Read Also: Amarnath Yatra: ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. బయల్దేరిన యాత్రికులు

ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలవరం ప్రాజెక్టుపై అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు.
అలాగే, రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చినతకు నోటీసులు జారీ చేయడంపై కూడా రియాక్ట్ అయ్యారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసి ఎన్ని భూములను లీజుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోనూ తెలుగు దేశం పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను తీసుకున్నారు.. తెలంగాణలోని టీడీపీ కార్యాలయానికి తీసుకున్న భూములను ఎన్టీఆర్ ట్రస్ట్ కు తరలించడం నిజం కాదా అని మాజీ ఎంపీ భరత్ రామ్ ఆరోపించారు.