Site icon NTV Telugu

Leopard in Kadiyam Nurseries: కడియంలో చిరుత కలకలం.. ఇది అదేనా..?

Leopard

Leopard

Leopard in Kadiyam Nurseries: రాజమండ్రి శివారు దివానచెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత కొద్ది రోజులుగా జాడ లేదు. అయితే, నిన్న రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధ్రువీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు పాద ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం- వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు. అడవీశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు.

Read Also: Chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి తప్పిన పెను ప్రమాదం

చిరుత దివాన్ చెరువు నుంచి కడియం నర్సరీల్లోకీ ఎలా వచ్చింది అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండడం లేదు. దీంతో చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా ఇక్కడి నుంచి సమీపంలోని ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలగే అవకాశం ఉంటుంది. ఏదేమైనాప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని,దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు.

Exit mobile version