NTV Telugu Site icon

Harsha Kumar: తమిళనాడు ఘటన అమానుషానికి పరాకాష్ట

Harshakumar

Harshakumar

తమిళనాడులో ఒక కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి రెండు చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమారు ఆవేదన వ్యక్తం చేశారు.. శుక్రవారం రాజమండ్రిలో జీవీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బుల్లెట్ నడిపితే అంత వివక్ష చెందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో గుర్రం ఎక్కాడని ఒక పెళ్లికొడుకుని చంపేశారు. ఇప్పుడు బుల్లెట్ నడిపినందుకు ఒక విద్యార్థి చేతులు నరకడం అనేది చాలా అమానుషమైన ఘటనని.. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల అయినా ఇంకా ఇలాంటి వివక్షత చూపించడం బాధాకరమైన విషయమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిందించకపోయినా.. సమాజంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఒక పక్షపాత బుద్ధితో ఎస్సీ చట్టాల్ని నీరు గార్చే పనిలో సుప్రీంకోర్టు ఉందని ఆయన ఆరోపణ చేశారు.

ఇది కూడా చదవండి: Rajiv Kumar: మంగళవారం ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ.. కొత్త సీఈసీ ఎంపిక ఎప్పుడంటే..!

అట్ట్రాసిటీ యాక్ట్ కేసు‌కి స్టేషన్ బెయిల్ ఇవ్వడం హర్ష కుమార్ తప్పుపట్టారు.. ఈ పరిణామాలన్నీ వివక్షతను తొలగించాలనుకుంటున్నాయా లేదా ప్రోత్సహించాలనుకుంటున్నాయో అర్థంకాని పరిస్థితిలో ఉన్నామని ఆయన అన్నారు. చుండూరులో ఊచ కోత జరిగితే నిందితులని నిర్ధోషులుగా విడుదలచ్చేసిందని.. ఇప్పటికీ ముద్దాయిలను పట్టుకోకపోవడం చాలా బాధాకర విషయం అన్నారు… ఇకనైనా సుప్రీంకోర్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా… దళితుల పట్ల దయ ఉంచి కఠిన చట్టాలు తీసుకొచ్చి దళితులపై దాడులను ఆపి, దళితులను కాపాడాలని కోరారు.

ఇది కూడా చదవండి: Se*xual Harassment: పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు.. వివాహిత సూసైడ్