NTV Telugu Site icon

Head Constable Suspended: నైట్‌ షిఫ్ట్‌లో మహిళా హోంగార్డుకు వేధింపులు..! హెడ్‌ కానిస్టేబుల్‌పై వేటు..

Bommuru Police Station

Bommuru Police Station

Head Constable Suspended: రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో మహిళా హోంగార్డు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్‌పై సస్పెండ్‌ వేటు పడింది.. ఈ నెల 8వ తేదీన నైట్ డ్యూటీలో ఉంటూ అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.. అదే సమయంలో స్టేషన్ లో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ ప్రయత్నించినట్టు.. ఆ మహిళా హోంగార్డు ఆరోపిస్తోంది.. అయితే, ఆ అసభ్య ప్రవర్తనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది మహిళా హోంగార్డు.. దీంతో.. పోలీస్‌ స్టేషన్ నుంచి తిరిగి వెళ్లిపోయాడు హెడ్ కానిస్టేబుల్.. ఈ మేరకు భర్తతో కలిసి బాధిత మహిళా హోంగార్డు జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్ కి ఫిర్యాదు చేసింది. తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను కూడా ఎస్పీకి చూపించారు.. ఆ సెల్ ఫోన్ దృశ్యాలను చూసి హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదుచేసి, సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ. ఈ మేరకు కేసు నమోదు చేసి.. పోలీసులు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. కాగా, అందరికీ భద్రత కల్పించాల్సిన పోలీసులే.. అది కూడా పోలీస్‌ స్టేషన్‌లోనూ.. ఓ మహిళా హోంగార్డు పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెళ్లివెత్తాయి.. డ్యూటీలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ మందు కొట్టి పీఎస్‌కు రావడంపై మండిపడుతున్నారు..

Read Also: VishwakSen : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..?

Show comments