Site icon NTV Telugu

Road Accident: అర్ధరాత్రి తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

Road Accident

Road Accident

Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురి దుర్మరణం చెందారు.. దీంతో.. దేవరపల్లి, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: రాధాష్టమి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే కృష్ణుని అనుగ్రహముతో సకల భోగభాగ్యాలు..

ఈ రోడ్డు ప్రమాదానికి చెందిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది.. అయితే, ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది.. ఆ సమయంలో వాహనంలో 13 మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు.. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధు (తాడిమళ్ల)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read Also: రాధాష్టమి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే కృష్ణుని అనుగ్రహముతో సకల భోగభాగ్యాలు..

ప్రమాదంలో మృతి చెందిన జట్టు కార్మికుల వివరాల్లోకి వెళ్తే.. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ మృతిచెందినట్టుగా గుర్తించారు పోలీసులు..

Exit mobile version