NTV Telugu Site icon

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

Rajahmundry Airport

Rajahmundry Airport

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో తుపాకీ బుల్లెట్లు కలకలం సృష్టించాయి.. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి రాగా.. టెర్మినల్ భవనంలోకి వెళ్తున్న సమయంలో ఆయన వద్ద బుల్లెట్లు ఉన్నట్లు స్కానింగ్ లో తేలింది.. వెంటనే అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. సుబ్బరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, సుబ్బరాజుకు లైసెన్సుడు గన్ ఉందని.. తుపాకీ లోడ్ చేసే సమయంలో బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.. మొత్తంగా 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకుని, సుబ్బారాజును కోరుకొండ పోలీసుస్టేషన్ కు తరలించారు.. ఇక, పీఎస్‌లో సుబ్బరాజును ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.. విమానాశ్రయం నిబంధనల ప్రకారం బుల్లెట్లతో ప్రయాణించే క్రమంలో సంబంధిత ప్రయాణికుడి‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు సుబ్బారాజుపై కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తుండగా.. ఈ కేసులో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు.. ఎలా ముందుకు వెళ్తారు అనేది చర్చగా మారింది..

Read Also: Social Media Ban: ఈ వయస్సులోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్​, ఫేస్బుక్ నిషేదం

Show comments