కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ విమానా సర్వీసులు నిలిచిపోయాయి… ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా విదేశీ విమానాలను నిలిపివేశారు అధికారులు.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త చేతుల్లోకి రావడంతో.. తిరిగి విదేశీ సర్వీసులను ప్రారంభించారు.. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో రాష్ట్రానికి చేరుకుంది ప్రత్యేక విమానం.. అయితే, ఇవి గతంలో మాదిరి రెగ్యులర్ సర్వీసులు కావు.. వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.. దీంతో.. విదేశాల నుంచి స్వదేశానికి తరలివస్తున్నారు. ఇక, రాష్ట్రానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతా, తనిఖీ ఏర్పాట్లు పర్యవేక్షించారు అధికారులు.. తొలుత స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతించారు.. ప్రవాసాంధ్రులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం.
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు విదేశీ సర్వీసులు పునః ప్రారంభం..
flights