NTV Telugu Site icon

Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం.. డైవర్స్కి కూడా అప్లై చేశాం

Madhuri .

Madhuri .

Divvala Madhuri: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ కుటుంబ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడకండి.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నేను ఫ్రెండ్స్ అని చెప్పినా.. దువ్వాడపై, నాపై వాణి అనేక ఎలిగేషన్స్ చేయటంతోనే మా బంధం కొనసాగించాలని అనుకుంటున్నాం అని మాధురి వెల్లడించింది.

Read Also: Luana Alonso: నెయ్‌మర్ నుంచి ప్రైవేట్‌ మెసేజ్‌ వచ్చింది.. బాంబ్ పేల్చిన ఒలింపిక్స్‌ బ్యూటీ!

అయితే, దువ్వాడ శ్రీనివాస్ నేను ఇక నుంచి కలిసే ఉంటాం అని దివ్వల మాధురి స్పష్టం చేసింది. దువ్వాడ, నేను ఇద్దరం డైవర్స్ కి అప్లై చేసాం.. దువ్వాడ శ్రీనుతో నా బందం కొనసాగుతుంది.. దువ్వాడను‌ ఇంటి నుంచి గెంటి వేశారు.. దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉన్నారు.. నేను దువ్వాడతో భవిష్యత్ లో కలిసి ముందుకు వెళ్తాం.. టీడీపీ దువ్వాడ విషయంలో రాజకీయం చేస్తుంది అని ఆరోపణలు గుప్పించింది. దువ్వాడ వాణి క్షమాపణ చెబితే నేను దేశం వదిలి వెళ్లిపోతాను అంటూ దివ్వల మాధురి పేర్కొనింది.

Show comments