కర్నూలు జూపాడుబంగ్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో వందలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు,విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురైన 20 మందిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు పిల్లలు వున్నారు.
వీరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.
జూపాడుబంగ్లాలోని నీలిపల్లె పేటకు చెందిన 20 మంది నందికొట్కూరు ఆసుపత్రిలో చేరారు. ఆరుగురు ఆందోళనకరంగా వుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచి నీరు కలుషితం కావడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు చెబుతున్నారు.