అమరావతి : దేవాలయాల్లో అక్రమాల కట్టడికి దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇకపై దేవాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని వివిధ స్థాయిల్లోని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత కొంత కాలంగా రెగ్యులర్ చెకింగ్‌లు లేకపోవడంతో దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డ దేవదాయ శాఖ కమిషనర్ అర్జున రావు…. కొందరు ఈవోలు ఉన్నతాధికారులిచ్చే ఆదేశాలు పాటించడం లేదని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
read more :హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
ఆకస్మిక తనిఖీల్లో క్యాష్ బుక్, వోచర్లు, నిర్మాణ పనులు వంటి అంశాలను పరిశీలించాలని సూచనలు చేశారు. దేవుని నగలు, దేవాలయాల ఆస్తుల పరిస్థితిపై ఆకస్మిక తనిఖీల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఏయే స్థాయి అధికారులు.. ఏయే దేవాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.. ఎవరికి రిపోర్ట్ చేయాలనే విషయాలపై సర్క్యులర్ జారీ చేశారు.
