Site icon NTV Telugu

Deputy CM Pawan: ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు.. పవన్ చొరవతోనే గడువు పొడిగించిన కేంద్రం

Pawan

Pawan

Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది. జల్ జీవన్ మిషన్ పనులపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్.. ఇంటింటికి సురక్షిత తాగు నీటి సరఫరా లక్ష్యంగా పనుల్లో వేగం పుంజుకుంది. తొలిసారి గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం మొత్తం సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. శాఖ అంతర్గత సామర్థ్యం పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. నీటి శుద్ధి, నాణ్యత, సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏడాదిలో రూ. 7,910 కోట్ల జల్ జీవన్ పనులకు శ్రీకారం చుట్టగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

Exit mobile version