Site icon NTV Telugu

ఒక్కో నేత రెండువందల ఎకరాలు దోచుకున్నారు : డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ చిత్తూరు ల్యాండ్ స్కామ్ పై స్పందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో వేలాది ఎకరాలు భూ కబ్జాలు జరిగాయి. చిత్తూరుజిల్లాలో 15 వేల ఎకరాలను టీడీపీ నేతలు కబ్జాలు చేశారు. స్దానిక టీడీపీ నేత సహకారంతోనే 2320 ఎకరాలు దోచుకున్నారు. సోమల మండలంలో ప్రభుత్వ,అటవీ భూమిని దోచుకున్నారు. టీడీపీ నేతల జిల్లాలో వేలాది భూములను ఆక్రమించుకున్నారు. అడవీ రమణ అనే వ్యక్తి స్దానిక టీడీపీ నేత… అతనే అక్కడి భూములను బోగస్ పత్రాలతో కోట్టేయాలని చూశారు. జిల్లాలో భూముల ఆక్రమణలపై మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేయాలీ అని డిప్యూటీ సీఎం కోరారు. భూములు కబ్జాలు చేయడం …దానిపై చంద్రబాబు సహాకారంతో టీడీపీ నేతలు కోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఈ భూముల కబ్జాలపై ఫూర్తి స్దాయి విచారణ చేపడుతాం. జిల్లాలో ఒక్కో నేత రెండువందల ఎకరాలు దోచుకున్నారు పేర్కొన్నారు.

Exit mobile version