NTV Telugu Site icon

Kottu Satyanarayana: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు.. 70 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Deputy CM Kottu Satyanarayana On Vijayawada Temple Development: దేవాదాయ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గతంలో సీఎం జగన్ మంజూరు చేసిన రూ.70 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్‌ని రూ.27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్‌లుగా అన్నదానం భవనం నిర్మాణం చేపట్టామన్నారు. ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్నప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నామన్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ.20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్‌టెన్షన్ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.

Malaria: అమెరికాను భయపెడుతున్న మలేరియా.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేసులు..

ఇందుకు సంబంధించిన టెండర్లను ఈ వారం పిలుస్తున్నామని కొట్టు సత్యనారాయణ చెప్పారు. రూ.28 కోట్లతో స్టెయిర్‌కేస్, అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ.6 కోట్లతో పూజా మండపాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీని టెండర్లు జులై రెండవ వారంలో పిలుస్తామన్నారు. విజయవాడ దేవాలయంలో ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. రూ.60 కోట్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లలో ఇప్పటికే దాదాపు రూ.14.70 కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధి పననులు సాగుతాయన్నారు. శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

Pune: ప్రపోజల్‌ని తిరస్కరించిందని గర్ల్‌ఫ్రెండ్‌పై కొడవలితో దాడి..

శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయని కొట్టు సత్యనారాయణ గుర్తు చేశారు. మళ్లీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వాటిని నిర్మించబోతున్నామని ఆనందం వ్యక్తపరిచారు. కాణిపాకంలో రూ.3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్‌ని ఏర్పాటు చేస్తున్నామని, రూ.4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో 1917 ఆలయాలు మంజూరు చేశామన్నారు. ఆలయాల పాలనా వ్యవహారాల్లో గత సంవత్సర కాలంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టామని, ప్రీ ఆడిట్ విధానం ద్వారా అవినీతి ఆరోపణలకి చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. ఆలయాలలో ప్రతీ మూడు నెలలకి సిబ్బంది అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశించామని చెప్పారు.