జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి రెండుచోట్ల ఓడిపోయిన మంచి నాయకుడు అని… పవన్ సినిమాల్లో మంచి డాన్సులు , ఫైట్లు చేస్తాడని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా ,సినీహీరోగా పవన్ కళ్యాణ్ అంటే నాకూ అభిమానమేనని… కానీ పవన్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. జగన్ తో తనను పవన్ పోల్చుకోకుండా ఉంటే మంచిదని… పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు జగన్ అని కొనియాడారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల పై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు జగన్ అని… జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరన్నారు. జగన్ కు పోటీ ఎవరూ లేరు…జగన్ కు జగనే సాటి అని తెలిపారు. జగన్ ను విమర్శించే ముందు పవన్ , లోకేష్ విజ్ఞతతో ఆలోచించాలని చురకలు అంటించారు.
పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కౌంటర్
Show comments