అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయడం లేదు. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కృష్ణదేవిపేట నుంచి వచ్చిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో బాధపడింది. కరెంట్ లేకపోవడంతో సెల్‌ఫోన్ లైట్ల మధ్యనే వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ఆ సమయంలో గ్రామంలో ఆస్పత్రి స్టాఫ్‌కు కొవ్వొత్తులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ప్రసూతి విభాగంలో ఉన్న చంటిబిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు కరెంట్ సరఫరా లేకపోవడం వల్ల ఉక్కపోతతో అల్లాడిపోయారు. దోమలతో ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
https://ntvtelugu.com/cm-ys-jagan-satirical-comments-on-chandrababu-and-pawan-kalyan/
