NTV Telugu Site icon

Flood Flow Reduced: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద..

Dawaleshwaram

Dawaleshwaram

Flood Flow Reduced: గోదావరి నది ప్రవాహం ఈరోజు (ఆదివారం) నిలకడగా కొనసాగుతుంది. గంట గంటకు క్రమేపీ గోదావరి వరద ప్రవాహం తగ్గుతుంది. ఇక, ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకు భారీగా తగ్గిపోయిన వరద నీరు. ఇక, పోలవరం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.655మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 87వేల 679క్యూసెక్కుల నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.90. అడుగులకు తగ్గిన గోదావరి వరద నీటిమట్టం ఉంది. బ్యారేజ్‌ నుంచి డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 7 లక్షల 33 వేల 627 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాధారణ స్థాయికి గోదావరి వరద నీటిమట్టం చేరుకుంటుంది.

Read Also: Vamana Jayanti: వామన జయంతి వేళ ఈ స్తోత్రాలు వింటే అదృష్టవంతులవుతారు..

కాగా, శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 48 వేల 749 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 68 వేల 242 క్యూసెక్కులు కొనసాగుతుంది. కాగా, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో 885 అడుగులు నీటి మట్టం ఉంది. ప్రస్తుతం 883.80 అడుగులు ఉండగా.. 215.8070 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 208.7210 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.