NTV Telugu Site icon

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

గత కొన్ని రోజులగా శ్రైశైలం జలాశయానికి వరదనీరు రాగా, ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గుతోంది. ఎగువన ఉన్న జలాశాయల్లోకి వరద నీరు తగ్గడంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ఇన్‌ఫ్లో: 16,135 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో : 70,831 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రైశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880.10 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 188.5754 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.