Site icon NTV Telugu

Andhra Pradesh: శ్రీసిటీలో భారీ పరిశ్రమ.. సౌతిండియాలో ఇదే మొదటిది

Sri City Min

Sri City Min

ఏపీలోని శ్రీసిటీలో భారీ పరిశ్రమ కొలువుదీరనుంది. జపాన్ ప్రపంచ నంబర్‌వన్ ఏపీ కంపెనీ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సంస్థకు దేశంలోనే ఇది మూడో ప్లాంట్ కాగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం మొదటిది కావడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్‌ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు డైకిన్‌ సంస్థ వెల్లడించింది.

భారీ వినియోగం ఉండే ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశమైన శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు డైకిన్‌ ఇండియాఎండీ, సీఈవో కన్వాల్‌జీత్‌ జావా వెల్లడించారు. 75.5 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే 3వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ మసయుకి టాగా, ఫ్యుజిత సీనియర్‌ ఎండీ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కన్వాల్‌జీత్‌ జావా పాల్గొన్నారు.

https://ntvtelugu.com/power-holiday-for-industries-in-andhra-pradesh/

Exit mobile version