Cyclone Akvan : ఊపిరి పీల్చుకున్న ఏపీ తీరం.. తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు

  • తుఫాన్ కదలికల్లో కీలక మార్పులు
  • తీరానికి చేరే కొద్దీ తగ్గనున్న తీవ్రత
  • పూరీ-నర్సాపూర్ మధ్య తీరం దాటే సూచనలు
  • శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రాన్ని వణికించిన ‘అక్వాన్’ అతి తీవ్ర తుఫాన్ ముప్పు దాదాపుగా తప్పినట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా తుఫాన్ కదలికల్లో కీలక మార్పులు చోటుచేసుకోవడం ఏపీకి పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.

తీరానికి చేరువయ్యే కొద్దీ బలహీనపడే ఛాన్స్

ప్రస్తుత అంచనాల ప్రకారం, అక్వాన్ తుఫాన్ మరో రెండు రోజుల పాటు సముద్రంలోనే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇది తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ తన తీవ్రతను కోల్పోయి బలహీనపడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తాజా విశ్లేషణల ప్రకారం, ఈ తుఫాన్ పూరీ – నర్సాపూర్ మధ్య శ్రీకాకుళం జిల్లా తీరానికి దగ్గరగా క్రాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తుఫాన్ ముప్పు తప్పినా కొనసాగనున్న వర్షాలు

తుఫాన్ తీరం దాటే సమయంలో పెను ప్రమాదం తప్పినప్పటికీ, దాని ప్రభావం మాత్రం రాష్ట్రంపై ఉండనుంది. తుఫాన్ ఎక్కడ తీరం దాటినా ఏపీ వ్యాప్తంగా వర్షాల ఉధృతి కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మొదలుకుని బాపట్ల వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, తీర ప్రాంత ప్రజలు , అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.