Site icon NTV Telugu

ఆనందయ్య కరోనా మందు పంపిణీ ఆపకూడదు

ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సహజమైన మూలికలతో ఆనందయ్య మందు తయారు చేశారని.. 60 వేల మందికి పైగా ఆనందయ్య వద్ద మందు తీసుకున్నారని నారాయణ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా పాజిటివ్ వస్తుందని… ఆనందయ్య మందుపై కార్పోరేట్ కనుసన్నల్లోనే వివాదం జరుగుతుందని తెలిపారు. ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీ చేయాలని… ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి ఆనందయ్య ద్వారా మందు సరఫరా చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకి లొంగిపోకుండా ఆనందయ్య తయారు చేస్తున్న మందు ప్రజలకు అందించాలన్నారు.

Exit mobile version