ఎప్పుడూ గ్రీన్ జోన్ లో ఉండే విజయనగరం జిల్లాలో కరోనా టెన్షన్ మొదలైంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీలకు చెరువవుతున్నాయి ..ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ఇటు అధికారులు , అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా .. కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేయడం తో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి గత నెల వరకు ఒకటి రెండు కేసులతో గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఇప్పుడు డబుల్ సెంచరీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .. తాజాగా ఓకే రోజు 193 కేసులు నమోదు కావడం ఇటు అధికారులను , అటు ప్రజలను టెన్షన్ పుట్టిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 42148 పాజిటివ్ కేసులు నమోదవ్వగా కరోనాతో జిల్లాలో 2079 మృతి చెందారు.. కరోనా నుంచి కోలుకున్న 41294 మందిని డిస్ చార్జ్ చేశారు. ప్రస్తుతం 647 5 మందికి చికిత్స ని అందిస్తున్నారు .. చిన్నా పెద్దా తేడా లేకుండా కరోనా భారిన పడుతున్నారు. జిల్లాలో అధిక కేసులు ప్రధాన పట్టణాలు అయిన విజయనగరం , బొబ్బిలి , పార్వతీపురం , సాలూరు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.. పట్టణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం , మార్కెట్ , స్కూల్ , సినిమా థియేటర్లలో సామాజిక దూరం కనీసం పాటించకుండా ఇష్టానుసారం ప్రజలు తిరగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతోంది ..
ఒకప్పుడు గ్రీన్ జోన్ జిల్లా.. కానీ ఇప్పుడు టెన్షన్, టెన్షన్ !!
