తిరుపతి : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా ఏపీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
ఏపీ డిప్యూటీ సిఎంకు కరోనా పాజిటివ్
