Site icon NTV Telugu

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎన్నంటే…?

ఏపీలో మొన్నటి వరకు తగ్గిన కరోనా మహమ్మారి కేసులు.. మళ్లీ పెరిగాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా… గడిచిన 24 గంటల్లో కొత్తగా.. 130 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దారించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,76,979 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 493 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1081 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 97 మంది బాదితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2061405 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 33,188 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,12,95,287 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read Also: మేడారం జాతర పనులను వేగవంతం చేయాలి: ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణలో…
ఇటు తెలంగాణలోనూ కేసుల సంఖ్‌య గణనీయంగా పెరిగింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,587గా కాగా, కరోనాతో రికవరి అయినా వారు206 మంది , కాగా ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందారు. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య4025గా ఉంది. రికవరీ రేటు 98.88శాతంగా ఉంది. ఐసోలేషన్‌లో 3,563 చికిత్స పొందుతున్నారు. 37,926 శాంపిల్స్‌ను టెస్టు చేశారు. ఇంకా 5,715 రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Exit mobile version