NTV Telugu Site icon

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ జగన్ : 48 గంటల్లో నియామకాలు చేపట్టాలని ఆదేశాలు

ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని.. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని… 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని..ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి.. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్. ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలని..పెళ్లిళ్లలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలన్నారు. జిల్లాల్లో ఒక జేసీ ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని.. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలని ఆదేశించారు.