NTV Telugu Site icon

ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ ఫోక‌స్‌.. కీల‌క స‌మావేశం

పీఆర్సీ ఉద్య‌మం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉధృత‌మైంది.. ఇప్ప‌టికే ఛ‌లో విజ‌య‌వాడ‌తో స‌త్తా చాటిన ఉద్యోగులు.. ఇప్పుడు స‌మ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం, ఉద్యోగ సంఘాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతో గ్యాప్ పెరిగిపోయింది.. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. ఉద్యోగులు పెన్‌డౌన్ అంటూ ఆందోళ‌న ఉదృతం చేయ‌గా.. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టారు.. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వ‌హిస్తున్నారు.. ఈ స‌మావేశానికి మంత్రులు బుగ్గన , బొత్స , ప్రభుత్వ సలహాదారు సజ్జల.. సీఎస్ సమీర్ శర్మ త‌దిత‌రులు పాల్గొన‌గా.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ స‌మావేశం కీల‌కంగా మారింది.. ఉద్యోగులు ఇవాళ చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చ సాగుతోంది.. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై సీఎం వైఎస్ జగన్ చ‌ర్చిస్తున్నారు.. పీఆర్సీ సహా హెచ్ఆర్ఏ, ఇతర డిమాండ్ల పైనా చ‌ర్చ సాగుతున్న‌ట్టుగా తెలుస్తోంది.. ఇక‌, సోమవారం నుంచి ఉద్యోగులు నిర‌వ‌ధిక‌ సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం వైఎస్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్న‌ట్టుగా స‌మాచారం.. ఒక‌వేళ ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తే.. పాలన స్తంభించకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సీఎం వైఎస్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు.

Read Also: రోజా తీవ్ర అసంతృప్తి..! అవ‌స‌ర‌మైతే రాజీనామాకు సై..