Site icon NTV Telugu

AP: మాజీలు కానున్న మంత్రులతో సీఎం జగన్ భేటీ.. వన్ టు వన్ సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది.. దీంతో.. ఎవరి పదవి ఊడిపోతుంది..? కేబినెట్‌లో మిగిలేది ఎవరు? మాజీలు అయ్యేది ఎంత మంది? కొత్తగా పదవి దక్కించుకునేది ఎవరు? ఇలా ఏపీలో అధికార వైసీపీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది.. అయితే, కేబినెట్‌ నుంచి తప్పించినంత మాత్రాన వాళ్లను పక్కనబెట్టినట్టు కాదు.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.. మరోవైపు.. మాజీలు కానున్న మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.. ఈ నెల ఏడున మంత్రివర్గ సమావేశం జరగనుంది… ఇక, ఏడు, ఎనిమిది తేదీల్లో మాజీలు కాబోతోన్న వన్ టు వన్‌ కలవబోతున్నారు సీఎం.. కొందరితో లంచ్, డిన్నర్ మీటింగ్‌లు జరగబోతున్నాయి..

Read Also: Ugadi: సీఎం జగన్‌.. శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు..

వన్‌ టు వన్‌ జరగనున్న సమావేశాల్లో మాజీలు కాబోతున్న మంత్రుల మనసులోని మాటలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. వారిలోని అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయనున్నారు వైసీపీ అధినేత.. ప్రభుత్వంలో పదవులు పోయినా, పార్టీలో కీలక పోస్టులు అప్పగించే యోచనలో ఉన్న ఆయన.. కేబినెట్‌ కంటే పార్టీ పోస్టులకే తాను అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సర్ది చెప్పబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. కాగా, మొదట మంత్రి పదవులు ఇచ్చినవారికి పదవులు శాశ్వతం కాదు.. మళ్లీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ఆదిలోనే సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version