NTV Telugu Site icon

New Governor Justice Abdul Nazeer: ఏపీకి చేరుకున్న కొత్త గవర్నర్‌.. స్వాగతం పలికిన సీఎం వైఎస్‌ జగన్‌

New Governor

New Governor

New Governor Justice Abdul Nazeer:ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్రానికి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నూతన గవర్నర్ కు ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌తో పాటు సీఎస్‌ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు స్వాగతం పలికారు.. ఇక, కొత్త గవర్నర్‌కు విమానాశ్రయంలో నేతలను, అధికారులను పరిచయం చేశారు సీఎం జగన్.. అనంతరం పోలీసు గౌరవవందనం స్వీకరించిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.. ఆ తర్వాత సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.. కాగా, ఎల్లుండి అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.

 

 

 

 

 

 

 

Show comments