NTV Telugu Site icon

Ugadi: సీఎం జగన్‌.. శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు..

తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి… శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని ఆయన ఆకాక్షించారు… శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: KTR: కేటీఆర్‌కు అరుదైన అవకాశం.. ఐటీ మంత్రి హర్షం..

శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని.. సమృద్ధిగా వానలు కురవాలని.. పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం.. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆకాంక్షించారు.