NTV Telugu Site icon

CM YS Jagan: మరోసారి ఉదారత చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Ys Jagan Helps Guirl

Ys Jagan Helps Guirl

CM YS Jagan Helps Girl Jahnavi For Higher Studies: ఏపీ సీఎం జగన్ మరోసారి ఉదారత చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక భరోసా అందించారు. తన ఉన్నత చదువుకు గతేడాది జులై రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌‌ను పాలకొల్లుకు చెందిన జాహ్నవి దుంగేటి కలిశారు. ఆమె విజ్ఞప్తి విన్న వెంటనే జగన్ ఆర్థిక సాయం అందించారు. గతంలో జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు రూ. 50 లక్షల సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందజేసింది. ఇప్పటికే నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకుంది. భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా.. అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో తాను ముందుకెళ్తున్నట్టు సీఎం జగన్‌కి జాహ్నవి వివరించింది. తన కలని సాకారం చేయడంలో సహాయం చేసినందుకు గాను.. జాహ్నవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Smart Watch Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 89 శాతం తగ్గింపు ఆఫర్.. రూ. 12 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 1299లకే!

మరోవైపు.. గురజపులంకలో పర్యటిస్తున్న సీఎం జగన్ స్థానికులు సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. గతంలో పేపర్లో ఫోటోలు వస్తే చాలని అనుకునేవారని.. కానీ ఇప్పుడలా కాదని, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చామని తెలిపారు. వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించామన్నారు. తానే స్వయంగా వచ్చి వరద బాధితుల్ని కలుస్తానని చెప్పానని, రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నానని అన్నారు. వరద సాయం అందని ఇళ్లు లేదన్నారు. పంట నష్టం జరిగితే ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలన్నారు. నెలలోపే పంట నష్ట సాయం అందిస్తామని.. గతంలో ఎప్పుడూ ఇలా పారదర్శకంగా వేగంగా అందించలేదని చెప్పుకొచ్చారు.

CP Ranganath: కల్తీ మందులు రైతులకు అమ్మితే.. పీడీ యాక్ట్ అమలు చేస్తాం..

Show comments