NTV Telugu Site icon

CM Jagan: సత్యసాయి జిల్లాలో ప్రమాదం సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Ys Jagan

Ys Jagan

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తగిలి ఎనిమిది మంది సజీవ దహనం అయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆటోకు విద్యుత్‌ షాక్‌ తగిలి మంటలు చెలరేగాయి.. మంటలు ఒక్కసారిగా తీవ్రం కావడంతో ఆటోలో ఉన్న 11 మందిలో 8 అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం జగన్‌.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విదేశాల నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Read Also: Nara Lokesh: సీఎంకు సోషల్‌ మీడియా అంటే వణుకు..! అందుకే అరెస్ట్‌లు..

మరోవైపు.. సత్యసాయి జిల్లా ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్,, ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీల మృతి విచారకరమన్న గవర్నర్, జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్ భవన్ అధికారులకు ఆదేశించారు.. ఇక, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఘటన పై విచారణకు ఆదేశించిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్టు వెల్లడించారు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.