NTV Telugu Site icon

వివిధ శాఖల పనితీరుపై సీఎం జగన్‌ సమీక్ష

ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్ధేశించిన కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాల యంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్‌ గ్రిడ్, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులతో పాటు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, వైయస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ తదితర కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను సీఎం జగన్‌ సమీక్షించారు.

విద్యాకానుకపై సమీక్ష
2021–22 విద్యాకానుక కోసం రూ.790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విద్యా కానుక కింద పిల్లలకు నోట్‌ పుస్తకాలు, షూలు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. జగనన్న గోరు ముద్దకోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మనబడి నాడు –నేడు మొదటి విడతకు ఇప్పటి వరకూ రూ.3650 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండో విడత కింద రూ. 12,663 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే దీనికోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు.విద్యారంగంలో నాడు నేడును సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

ఇతర పథకాలపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌లలో కొనసా గుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులపైనా సీఎం సమీక్షించారు.ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న సీఎం అధికారులకు సూచించారు.వచ్చే ఏడాది మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని సీఎం జగన్‌కు తెలిపిన అధికారులు. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణ పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వీటీతో పాటు రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. దాదాపు రూ.30వేల కోట్లకుపైగా మౌలిక సదుపాయల కోసం ఖర్చుచేస్తున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణం, వాటి పనులపై అధికారులను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు. పోర్టులతో పాటు షిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలు వేగంగా కొనసాగించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

Show comments