పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్… పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో ఇప్పటికే ఐదుగురు మహిళలు సహా 9 మంది మృతిచెందారు.. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.. ఇక, మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు.. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
