ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో బీఆర్‌ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టిపెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పది రోజుల్లో ఏపీలో బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు కానుంది. క్రిస్మస్ తర్వాత ఏపీలో బీఆర్‌ఎస్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఏపీకి చెందిన ప్రముఖులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 80మంది ప్రముఖులతో కేసీఆర్ చర్చలు జరిపారు. పదిరోజుల్లో బీఆర్ఎస్ విధివిధానాల ప్రకటన రానుంది.