Site icon NTV Telugu

Cm Jagan Tour: నర్సాపురంలో జగన్ పర్యటన.. భారీ బందోబస్తు

Cm Jagan

Cm Jagan

సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవాళ పర్యటించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయ‌నున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకోనున్న సీఎం. 11.15 – 12.50 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భీమవరంలో బీజేపీ నేతల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మను అరెస్టు చేశారు.

సీఎం పర్యటనలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు:

రూ,2వేల 437 కోట్ల విలువ కలిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

* 332 కోట్ల అంచనా వ్యయంతో ఏపి ఆక్వా విశ్వవిద్యాలయం శంకుస్థాపన, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన.

* 188.40 కోట్లతో ఉప్పుటేరు నదిపై మొళ్ళపర్రు వద్ద రెగ్యులేటర్ శంకుస్థాపన

* 4 కోట్లతో బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన.

* 1.08 కోట్లతో ఖజానా,లెక్కల కార్యాలయం శంకుస్థాపన.

* 132.81 కోట్లతో 220/132/33 కె.వి. రుస్తుంబాద విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన.

* 1,400 కోట్లతో జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టుల శంకుస్థాపన.

* 237 కోట్లతో అండర్ గ్రౌండు డ్రైనేజీ స్కీము శంకుస్థాపన

* 26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు అభివృద్ధి పనులు శంకుస్థాపన.

* 7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి పనులు శంకుస్థాపన.

* 24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం పనులు శంకుస్థాపన.

* 8.80 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు & ముస్కేపాలెం అవుట్ ఫాల్ స్లుయిస్ పనులకు శంకుస్థాపన.

* 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాంతీయ వైద్యశాల నూతన భవనం ప్రారంభోత్సవం.

* 61.81 కోట్ల నిధులతో పూర్తి చేసినపురపాలక సంఘం మంచి నీటి అభివృద్ధి పథకం ప్రారంభోత్సవం

* అగ్రికల్చర్ కంపెనీ భూములు రైతులకు యాజమాన్య హక్కులు కల్పించడం.

* నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూములు

* ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ శంకుస్ధాపన

* నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం

* ప్రజారోగ్యసాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం ప్రారంభోత్సవం

Read Also: Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి

Exit mobile version