క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేటి నుంచి వంద రోజలు పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడలోఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్లీన్ ఏపీ కోసం చెత్త సేకరించే 4 వేల 97 వాహనాలని ప్రారంభించి.. 13 జిల్లాల కార్మికులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి. పట్టణాలలో 3 వేల 97 హైడ్రాలిక్ గార్బేజ్ ఆటోలు, 1771 ఇ-ఆటోలని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలకుపైగా పంచాయతీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ప్రవేశపెడుతోంది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి మూడు డస్ట్ బిన్లు కూడా ఇవ్వనుంది.రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో 38 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొననున్నారు. ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని అధికారులు కోరుతున్నారు.
ఇవాళ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం
