కాసేపటి క్రితమే…. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ… నిబంధనలు అందరూ పాటిస్తే కరోనా తగ్గిపోతుందని…. ఆలయ భూములు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను కోరామని చెప్పారు. అర్చకత్వ అవకాశాలను వారసత్వంగా ఇవ్వాలని కోరానని… ప్రభుత్వంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ చాలా కష్టపడి పైకి వచ్చారని… సీఎంపై, హిందుత్వానికి విరుద్దంగా ప్రచారం జరగకూడదని కోరుతున్నానని వెల్లడించారు.
విజయవాడ సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్
