కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23 వ తేదీన అంటే రేపు ఉదయం 11 గంటల సమయంలో… గన్నవరం నుంచి ప్రొద్దుటూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇక రేపు సాయంత్రం ఇడుపుల పాయ ఎస్టేట్ లో బస చేయనున్నారు సీఎం జగన్. ఇక 24 వ తేదీన ఇడుపుల పాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. సమాధి వద్ద నివాళులు అర్పించ నున్నారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. ఇక 25 వ తేదీన ఉదయం పులివెందుల సీఎస్ ఐ.. చర్చి లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే.. అదే రోజు మధ్యాహ్నం.. తిరిగి తాడేపెళ్లికి రానున్నారు సీఎం జగన్.
