CM Jagan To Discuss With PM Modi Central Ministers On These 9 Points: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. తొలుత అమిత్ షాతో మధ్యాహ్నం 2:30 గంటలకు, ఆ తర్వాత ప్రధాని మోడీతో సాయంత్రం 4:30 గంటలకు, అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సాయంత్రం 6 గంటలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై వారితో చర్చించనున్నారు. ఆ అంశాలు ఏమిటంటే..
Devil Glimpse: రచ్చరేపిన ‘డెవిల్’ గ్లింప్స్.. సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్
* ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. వీటిని వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ కోరనున్నారు.
* రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రమేయం లేకున్నా.. రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని ఈ సందర్భంగా సీఎం వివరించనున్నారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని.. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు.
* తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాలని, వీటిని వెంటనే ఇప్పించాలని రిక్వెస్ట్ చేయనున్నారు.
* 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి ‘వనరుల కొరత’ కింద రూ.36,625 కోట్లు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదలయ్యేలా సహాయం చేయాలని కోరనున్నారు.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవాంతరం లేకుండా కొనసాగడానికి ‘అడహాక్’గా (తాత్కాలిక సహాయంగా) మంజూరైన రూ. 12,911 కోట్లు వెంటనే విడుదల చేయాలని అడగనున్నారు.
CPI Ramakrishna: కేంద్రమే బాధ్యత తీసుకొని.. పోలవరంను పూర్తి చేయాలి
* తాత్కాలిక సహయం కింద రూ. 10 వేల కోట్లతో పాటు ‘డయాఫ్రం వాల్’ ప్రాంతంలో మరమ్మతులకు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, ఈ నిధుల్ని త్వరగా విడుదల చేయాలని కోరనున్నారు.
* పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2600.74 కోట్లను సత్వరమే చెల్లింపులు చేయాలని కోరనున్నారు.
* పోలవరం ప్రాజెక్టు అంచనాలను ‘టెక్నికల్అడ్వయిజరీ కమిటీ’ రూ. 55,548 కోట్లుగా నిర్ధారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఇతరత్రా అంశాలను చర్చించనున్నారు.
* రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.