Site icon NTV Telugu

కల్లీ విత్తనాలు,ఎరువులు అమ్మితే కఠిన చర్యలు: సీఎం జ‌గ‌న్‌

వ్య‌వ‌సాయ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఒక‌వేళ క‌ల్తీ విత్త‌నాలు అమ్మితే.. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. దీనికోసం చట్టంలో మార్పులు, అవసరమైతే ఆర్డినెన్స్ తీసువ‌స్తామ‌న్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయన్నారు.

వీటిని నీరేగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఈ వ్యవహారాల్లో ఉద్యోగులు ప్రమేయం ఉంటే.. వారిని తొలగించడమే కాదు.. చట్టం ముందు నిలబెడతామ‌న్నారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ‌రించారు. పశువులకు ఆర్గానిక్‌ ఫీడ్‌ కూడా అందుబాటులో ఉండాలని… ఆర్గానిక్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ పైన దృష్టి పెట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల రైతులకు మంచి ఆదాయాలు లభిస్తాయని.. ఆర్గానిక్‌ఉత్పత్తుల ప్రాససింగ్‌ పైన కూడా దృష్టి పెట్టాల‌న్నారు సీఎం జ‌గ‌న్‌.

Exit mobile version