Site icon NTV Telugu

CM Jagan Mohan Reddy: హర్‌ ఘర్‌ తిరంగాపై జగన్ ఏమన్నారంటే…..?

Jagan Tiranga

Jagan Tiranga

azadi ka amrit mahotsav ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది కేంద్ర హోంశాఖ. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ జరిగింది. ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం.

దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు జగన్. ఆగష్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం వుంటుందన్నారు. 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరణ వుంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న సందర్బంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

సమగ్రమైన కార్యాచరణను రూపొందించింది. పలు ప్రభుత్వ విభాగాలతో పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించాం. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి బహుముఖంగా ప్రచారం నిర్వహించాం. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించాం. చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించాం. ర్యాలీలు, సైకిల్‌ర్యాలీలు నిర్వహించాం. పోస్టర్లతోపాటు పలు కథనాలు కూడా ప్రచురించాం. – రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు సంబంధిత వ్యాపకంలో ఉన్న ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్యపరిచాం. సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్ధేశించాం అని వివరించారు జగన్.

Etela Rajender : అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నాం

ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పాం. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి, వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాం. 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు. ప్రతి ఇంటిపైనా, సముదాయం పైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అని వివరించారు సీఎం జగన్.

ICSE 10th Results: ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..

Exit mobile version