Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Jagan Letter To Pm Modi And Amit Shah

వెయ్యి కోట్లు ఇవ్వండి..ప్రధాని మోడీ, అమిత్ షాకి జగన్ లేఖ

Published Date :November 24, 2021 , 12:38 pm
By NTV WebDesk
వెయ్యి కోట్లు ఇవ్వండి..ప్రధాని మోడీ, అమిత్ షాకి జగన్ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారీవర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో తాము బాగా నష్టపోయామని, ఆదుకోవాలంటూ తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్‌ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు.

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే రూ.వెయ్యికోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది.

తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. 196 మండలాల్లో నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని తన లేఖల్లో సీఎం జగన్‌ కోరారు.

వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం అంచనా రూ.1353 కోట్లు. వర్షాల వల్ల బ్రిడ్జిలు కూలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,42, 862 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. రహదారులు డ్యామేజ్ అవటం వల్ల జరిగిన నష్టం రూ.1756 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖలో నష్ట అంచనా రూ.1252 కోట్లు. డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం అంచనా రూ,556 కోట్లు. వర్షాల వల్ల మొత్తం నష్ట అంచనా రూ. 6,054 కోట్లు అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1000 crores assistance
  • Amit Shah
  • cm jagan
  • cm jagan letter
  • crop loss

తాజావార్తలు

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions