Site icon NTV Telugu

వాక్సినేషన్‌ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు

కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకూ కరోనా వాక్సినేషన్‌ ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్ ఆదేశాలు జారీ చేశారు. వాక్సినేషన్‌లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎం జగన్… 45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సినేషన్‌ 90 శాతం పూర్తైన తర్వాత… ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.

read also : ఇంట్లోవారికి కరోనా సోకినా ఉద్యోగులకు 20 రోజుల సెలవు.. సీఎం గ్రీన్‌ సిగ్నల్

ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్‌ ఇస్తున్నామని.. 5 ఏళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే… ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.

Exit mobile version