NTV Telugu Site icon

CM Jagan: మన లక్ష్యం 175 సీట్లు.. మనం సాధిస్తాం

Jagan New1

Jagan New1

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అనుమతి తీసుకుని సమావేశానికి పలువురు నేతలు హాజరుకాలేదు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి సమావేశానికి వచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వర్క్‌షాపును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఒక్కో సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయిస్తామన్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం వుంటుంది. గడప గడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగు పరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అని మనం చర్చించుకోవాలి.

దీని కోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తాం. ఆ నెలరోజుల్లో చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం, వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తాం అన్నారు. ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టి సారిస్తాం. ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుని చర్చిస్తాం. వర్క్‌షాపుకు హాజరైనవారు కూడా ఈ అంశాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.

దీని వల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారంకూడా అత్యంత ముఖ్యమైంది. ఈ ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా సాగడంపైన కూడా దృష్టి పెడుతున్నాం అన్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సాధించాలన్నారు. ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదన్నారు.

ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. ప్రతి అక్క చెల్లి పేరుమీద లేఖ కూడా ఇస్తున్నారు. మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం. ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు…. ప్రజా ప్రతినిధులుగా మనకు ఏం కావాలి. చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం అని చెప్పారు జగన్.

కాలర్‌ ఎగరేసుకుని తిరగ గలుగుతున్నాం. ఇక మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమే. ఎవరైనా అనుకున్నామా? కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌చేస్తామని? ఎందుకు జరిగింది? అలాగే 175కి 175 సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి. రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి. ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. ప్రతి సచివాలయంలో పొద్దుట నుంచి సాయంత్రం 6–7వరకూ గడప గడపకూ నిర్వహించాలి. ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. కార్యక్రమాన్ని నాణ్యతతో చేయడం అన్నది చాలా ముఖ్యం అన్నారు జగన్.

KTR Twitter: మోదీ జీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఎన్జీవోనా..?