Site icon NTV Telugu

CM Jagan: గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్

Jagan 1

Jagan 1

ఏపీ సీఎం జగన్ గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించనున్నారు.వైయస్సార్‌ యంత్ర సేవా పథకం – ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్ల మెగా పంపిణీ చేపట్టనున్నారు. గుంటూరులో రాష్ట్రస్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇప్పటి వరకు 6,781 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్ధాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు యంత్ర పరికరాల పంపిణీ జరిగింది.

రూ. 691 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసింది జగన్ సర్కార్. వ్యవసాయ పని ముట్ల కోసం 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీ జమ చేసింది ప్రభుత్వం. గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరనున్నారు సీఎం. 10.40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు సీఎం.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించనుప్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. జిందాల్‌ ప్లాంటు సమీపంలో హరిత నగరాలు నమూనా ఆవిష్కరణ చేస్తారు. జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ ఆవిష్కరణ, ప్లాంట్‌ ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు పోలీసులు.

Alliances: పొత్తుల అంశంపై నడ్డా దిశానిర్దేశం

Exit mobile version