Site icon NTV Telugu

CM Jagan : వాల్మీకి/ బోయలకి సీఎం జగన్ దీపావళి గిఫ్ట్

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

వాల్మీకి/ బోయ ఒరియా బెంతు కులాలకు చెందిన ప్రజల కళ్ళల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు. ఏళ్లుగా పరిష్కారం కాని అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చి వారం రోజుల ముందే వారికి దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. వాల్మీకి/ బోయ ఒరియా బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్ గత 20 ఏళ్లుగా ఉంటోంది. కానీ ఏ ప్రభుత్వము పట్టించు కోలేదు. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో ఆయా కులాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై నివేదిక సమర్పించేందుకు కమిషన్ నియమించారు. ఇటీవలే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పార్టీ క్యాడర్ తో సమావేశంలో ఈ అంశం తెర మీదకు వచ్చింది. సమావేశం జరుగుతుండగా క్యాడర్ వాల్మీకి / బోయ ఒరియా బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చాలనే అంశం తెర మీదకు తెచ్చారు. సదరు అంశంపై పూర్తిగా చర్చించిన సీఎం జగన్ తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి సీఎం జగన్ క్యాడర్ కు ఇచ్చిన హామీ మేరకు కేవలం వారం రోజుల్లో కమిషన్ నియమించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏక సభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ నేతృత్వంలోని ఈ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది వాల్మీకి/ బోయ, ఒరియా బొంతు కులాలు ఉన్నట్లు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్టీ హోదా తో పాటు వాల్మీకి / బోయలు రాజధానిలో వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దింతో పాటు రాజధానిలో వాల్మీకి భవన్ నిర్మించాలని కోరారు. ఎస్టీ హోదా కోసం ఎంపీలు పార్లమెంట్ లో చర్చించేలా చూడాలని కోరారు. క్యాడర్ నుంచి వచ్చిన డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో ఎస్టీ హోదా..

వాల్మీకి / బోయ ఒరియా బెంతు కులాలకు కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీ హోదా ఉంది. అక్కడ బీసీ లిస్ట్ లో ఉన్న ఈ కులాలకు ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాని ఏపీలో ఈ కులాలు బీసీ లుగా పరిగణలోకి తీసుకోబడుతున్నాయి. కారణం ఎస్టీ హోదా రావాలంటే సదరు కులాలు, వర్గాలకు చెందిన తెగలు అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించేవిగా లెక్కకడతారు. కాని వాల్మీకి / బోయలు పల్లపు ప్రాంతంలో నివసిస్తున్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీటికి ఎస్టీ హోదా దక్కక పోవడానికి ఇది ప్రధాన కారణంగా ఉంటోంది.

Exit mobile version