ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని సీఎం జగన్ రాజీనామా చేసిన మంత్రులతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ ఓడించాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబును మరోసారి ఓడించే బాధ్యత మీదేనని, మళ్లీ ఓడితే చంద్రబాబుకు రాజకీయ జీవితం ఉండదని రాజీనామా చేసిన మంత్రులతో జగన్ చెప్పారు. రెండున్నరేళ్లు మంత్రివర్గంలో కొనసాగారని, ఇక నుంచి పార్టీ కోసం సేవలు వినియోగించుకుంటానని చెప్పారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
కాగా ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ఐదుగురు మంత్రులు కొనసాగుతారని కొడాలి నాని హింట్ ఇవ్వడంతో ఆ ఐదుగురు ఎవరనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అనుభవం దృష్ట్యా కొంతమంది కొనసాగుతారని జగన్ చెప్పగా.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, జయరాం మంత్రులుగా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈనెల 11న కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారం జరగనుంది.
https://www.youtube.com/watch?v=AgW_L2clpG4
