NTV Telugu Site icon

Jagan – Bhupendra Yadav: కేంద్రమంత్రి భూపేంద్రతో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలివే

Jagan Bhupendra Yadav

Jagan Bhupendra Yadav

CM Jagan Bhupendra Yadav Meeting Highlights: తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. ఆ తర్వాత కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ అభవృద్ధికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువుతో అల్లాడే ఈప్రాంతానికి తాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైందని వివరించారు. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. దాంతో.. కృష్ణా నదిపై తనకున్న వాటా హక్కులను కోల్పోవాల్సి వస్తోందన్నారు.

Jagan – Modi: ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

2022–22, 2022–23 సంవత్సరాలలో తెలంగాణ జూన్‌ 1తేదీ నుంచే విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించిందని జగన్ వివరించారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి స్ధాయి 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటిమట్టం నిర్వహణకు సహకరించడం లేదని, దీని వల్ల ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ విషయాన్ని తాను గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని అన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప, పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, పర్యావరణ అనుమతులు లేకుండానే.. పాలుమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తోందని, ఈ విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకొచ్చానన్నారు. ఈ పరిస్థితిలో ఏపీ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.

Noida Crime: యజమాని అరాచకం.. పనిమనిషిని లిఫ్ట్‌లో నుంచి లాక్కెళ్లి..

రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని జగన్ తెలిపారు. తీరప్రాంతంలో 10 లక్షల మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయని.. వారిని ఆదుకోవడానికి 9 ప్రదేశాలలో ఫిషింగ్‌ హార్భర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 2024 మార్చి నాటికి పోర్ట్‌ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరు కోసం దరఖాస్తు చేశామన్నారు. ఈ పనులను వీలైనంత వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన అనుమతులు మంజూరుకు మీ సహకారం అందించాలని కోరారు. అలాగే.. పంప్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా గండికొట వద్ద 1000 మెగావాట్స్‌ పంప్డు స్టోరేజీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు కోసం ఏపీ ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఇప్పటికే ప్రతిపాదన పంపించిందని.. ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులు కూడా సకాలంలో ప్రభుత్వానికి సమర్పించనున్నామని వెల్లడించారు.