NTV Telugu Site icon

YSRCP: పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం

Cm Jagan

Cm Jagan

వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, బీసీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించారు. వ్యవసాయ విభాగానికి అధ్యక్షుడిగా mvs నాగిరెడ్డి, వైఎస్ఆర్‌టీయు- ట్రేడ్ యూనియన్ విభాగానికి అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు.

మైనారిటీ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హఫీస్ ఖాన్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా పితాని అన్నవరం, సాంస్కృతిక విభాగానికి అధ్యక్షురాలిగా వంగపండు ఉష, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని నియమించారు. రాష్ట్ర పోలింగ్ విభాగానికి అధ్యక్షుడిగా హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహ్మద్ రూహుల్లా, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కేంద్ర పార్టీ ఇంఛార్జిగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని వైఎస్ జగన్ నియమించారు.

Maharashtra Politics: మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. సీఎం పదవిపై ఉద్ధవ్ కీలక నిర్ణయం!