NTV Telugu Site icon

సీఎం జగన్‌ మరో నిర్ణయం.. వారికి రూ.10వేలు అర్థిక సహాయం..

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పేద బ్రహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వనుంది.

ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా మరణించిన 40 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పథకం కోసం http://andhrabrahmin.ap.gov.in/ వెబ్‌ సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సింది వెల్లడించింది.